చట్టాల్లో మార్పులు రావాలిః వెంకయ్య నాయుడు

535
venkaiha naidu
- Advertisement -

దిశ హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా దిశ అంశంపై రాజ్యసభలో చర్చ జరిగింది. పలువురు ఎంపీలు దిశ హత్య ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈసందర్భంగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం చట్టాల వల్ల బాధితులకు న్యాయం జరగదు. ప్రజల్లో కూడా మార్పు రావాలి. హైదరాబాద్ లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మహిళలపై దాడులకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది అన్నారు.

దిశ హత్య ఘటనపై ప్రతి ఒక్కరూ సలహాలు, సూచనలు ఇవ్వాలని సభ్యులను వెంకయ్య నాయుడు కోరారు. దిశ హత్య కేసు మన సమాజానికి, మన వ్యవస్థకు తీవ్ర అవమానం. ఇలాంటి చర్యలు ఎందుకు జరుగుతున్నాయో, వీటి పరిష్కార చర్యల కోసం మనం ఏదో ఒకటి చేయాలి అన్నారు.

దిశా ఘటనపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి కామాంధులను ప్రజలకు అప్పగించాలి. అప్పుడు ప్రజలే వారిపై మూకదాడి చేసి చంపేస్తారు. జరుగుతున్న ఘోరాలపై ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.

- Advertisement -