నా తమ్ముళ్ల వల్లే ఈస్ధాయిలో ఉన్నాః ఓంకార్

199
Raju-Gari-Gadhi3-

ప్రముఖ యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రం రాజుగారి గది3. ఈసినిమాలో అశ్విన్, అవికా గోర్ లు జంటగా నటించారు. ఓక్ ఎంటర్‌టైన్మెంట్స్‌పై నిర్మించారు. ఈసినిమా రేపు గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈసందర్భంగా నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈసందర్భంగా ఓం కార్ మాట్లాడుతూ.. నేను యాంకర్ నుంచి ఈ స్ధాయికి రావడానికి ముఖ్య కారణం నా తమ్ముళ్లు అశ్విన్, కళ్యాణ్. వాళ్ల చదువును కూడా మర్చిపోయి నా కెరీర్ కోసం కష్టపడ్డారు. నాకు జన్మనిచ్చింది మా అమ్మానాన్నలు అయితే.. నా సినీ కెరీర్‌కు జన్మనిచ్చింది నా తమ్ముళ్లే. ఈ సినిమాతో అశ్విన్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. కల్యాణ్‌ నిర్మాతగా త్వరలో ఓ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్న వరంగల్‌ శ్రీనుగారి నమ్మకం నిజం అవుతుందని నమ్ముతున్నాను. మా నాన్నగారు గత ఏడాది చనిపోయారు. అందుకే నేను ఎక్కువగా తెల్ల దుస్తుల్లో కనిపిస్తున్నా. ఈ సినిమాతో అశ్విన్‌ను ప్రేక్షకులు హీరోగా అంగీకరించిన తర్వాత తిరిగి మామూలు దుస్తులు వేసుకుంటానని చెప్పారు.