రజనీతో మురుగదాస్‌ మూవీ..?

231
Rajinikanth
- Advertisement -

దర్శకుడిగా మురుగదాస్‌కి తెలుగు, తమిళ్‌తో పాటు హిందీ భాషలోనూ మంచి క్రేజ్ వుంది. కథా కథనాలను పట్టుగా సిద్ధం చేసుకోవడంలోను .. తెరపై వాటిని ఆసక్తికరంగా ఆవిష్కరించడంలోను మురుగదాస్ సిద్ధహస్తుడు. అందువలన ఆయన అడగాలేగాని డేట్స్ ఇవ్వని కథానాయకులు అంటూ వుండరు. ఈ కారణంగానే ‘స్పైడర్’ సినిమా పరాజయంపాలైనా ఆ తరువాత సినిమాను ఆయన విజయ్‌తో చేయగలుగుతున్నాడు.

Rajinikanth

గతంలో విజయ్‌తో మరుగదాస్ చేసిన ‘కత్తి’ .. ‘తుపాకి’ హిట్ కొట్టడం వలన, ఆయన అభిమానులంతా ఇప్పుడు ఈ సినిమాను గురించే ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను రజనీకాంత్ తో ఒక సినిమా చేసే ఆలోచనలో వున్నట్టుగా మురుగదాస్ చెప్పాడు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నాడు.

అయితే ఇంతకుముందు రజనీతో సినిమా తీయడానికి మురుగదాస్ ఓ స్టోరీ తయారు చేసుకున్నాడు. కానీ రజనీ ఆ స్టోరీ నచ్చలేదని రిజెక్ట్ చేశాడు. దాంతో మురుగదాస్ రజనీకి నచ్చేలా స్క్రిప్టులో మార్పుచేర్పులు చేసి వినిపించాడట. మురుగుదాస్ చెప్పిన మార్పులు నచ్చడంతో రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం.ఇక విజయ్‌తో సినిమా పూరైన వెంటనే రజనీ సినిమా స్టార్ట్ చేయనున్నాట డైరెక్టర్‌ మురుగదాస్‌.

- Advertisement -