తలైవా… సడన్‌ ట్విస్ట్..!

235
Rajinikanth sudden twist..
- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్ ని దేవుడిలా కొలిచే ఫ్యాన్స్‌ కోకొల్లలు. అయితే ఫ్యాన్స్‌ దేవుడిలా కొలిచే ఈ తలైవాకి, ఫేవరెట్‌ దేవుడు ఉన్నాడు. ఆయనే రాఘవేంద్రస్వామి. రజినీకి దైవభక్తి ఎక్కువేనన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన రాఘవేంద్రస్వామికి పరమ భక్తుడు. అందుకే వీలు దొరికినప్పుడల్లా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకుంటూ ఉంటారు.

   Rajinikanth sudden twist..

ఇదే క్రమంలో తాజాగా రజినీకాంత్ మంత్రాలయం వెళ్ళారు. ముందుగా తుంగభద్ర నదిలో పుణ్యస్నానం ఆచరించి, గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. పీఠాధిపతి సుబుధీంద్ర తీర్థ స్వామీజీని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

Rajinikanth sudden twist..

అయితే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మంత్రాలయం వెళ్ళిన రజిని రాకతో మఠంలో సందడి నెలకొంది. రజినీతో ఫొటోలు దిగిందేకు అక్కడున్న భక్తులు ఎగబడ్డారు.

ఇదిలా ఉండగా..ఆయన ప్రధాన పాత్ర పోషించిన ‘రాఘవేంద్ర స్వామి మహత్యం’ సినిమా 1985లో విడుదలైంది. అప్పటి నుంచి రజినికాంత్‌ మంత్రాలయం రాఘవేంద్రుణ్ని దర్శించుకుంటూనే ఉన్నారు. 2012లో మంత్రాలయం మఠానికి రూ.10 కోట్లు విరాళం కూడా ఇచ్చారు.

- Advertisement -