మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్..

310
murugadas rajini
- Advertisement -

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జీకాంత్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ , ర‌జనీకాంత్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన 2.ఓ మూవీ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. 2.ఓ సినిమాతో పాటు ర‌జ‌నీ ‘పెట్టా’ సినిమాలో న‌టించాడు. ఈమూవీ కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇటివ‌లే విడుద‌లైన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఈసినిమాపై కూడా అంచానాలు భారీగానే ఉన్నాయి. పేట్టా మూవీ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే ఆయన మరో ప్రాజెక్టును లైన్లో పెడుతున్నారు.

rajini pettta

యువ హీరోల‌కు ధీటుగా ర‌జ‌నీ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ర‌జ‌నీ త‌దుప‌రి సినిమాపై ఫిలీం న‌గ‌ర్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ తో వుండ‌నుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్తపై మురుగదాస్ స్పందిస్తూ, తమ కాంబినేషన్లో సినిమా రూపొందనున్న విషయం నిజమేనని చెప్పారు.

petta

అయితే అంతా కూడా ఈ సినిమా రాజకీయాల నేపథ్యంలో ఉంటుందని అనుకుంటున్నారనీ, కానీ ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అన్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారనీ, సంగీత దర్శకుడిగా అనిరుధ్ వ్యవహరించనున్నాడని చెప్పారు. ముర‌గ‌దాస్ తెర‌కెక్కించిన సినిమా స‌ర్కార్ ఇటివ‌లే విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.

- Advertisement -