కమల్‌కు కౌంటరిచ్చిన రజిని..!

179
rajini couter to kamal
- Advertisement -

తమిళనాడులోని చెన్నైలో ప్రముఖ సినీనటుడు శివాజీ గణేశన్‌ స్మారక కేంద్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ ఒకే వేదికపై తళుక్కుమన్నారు.

అయితే సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ రాజకీయ రంగప్రవేశంపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. తమ పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటికే వీరిద్దరూ పలు వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ ఒకడుగు ముందుకేసి అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ కొత్తపార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. ఇదిలా ఉంటే కమల్ హాసన్‌పై రజినీకాంత్ సభాముఖంగా కౌంటర్ వేశారు.

 rajini couter to kamal

అయితే ఈ కార్యక్రమంలో పన్నీర్ సెల్వం ప్రసంగించిన అనంతరం మైక్ అందుకున్న రజినీకాంత్.. రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో గెలవాలంటే సినిమా, పేరు ప్రతిష్టలు సరిపోవు. ఇంకేదో కావాలి. అదేంతో ప్రజలకు బాగా తెలుసు.

నాకు మాత్రం నిజంగా తెలీదు. బహుశా అదేంటో కమల్‌ హాసన్‌కు తెలుసని నేను అనుకుంటున్నాను(నవ్వుతూ)’ అని సుతిమెత్తగా కౌంటర్ వేశారు రజినీకాంత్. అనంతరం కమల్ హాసన్ కూడా ప్రసంగించారు. అయితే ఆయన ఎలాంటి ఆసక్తికర, వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. మొత్తానికి ఇప్పటికే ఈ ఇరువురు హీరోల రాజకీయ రంగ ప్రవేశంపై జరుగుతున్న చర్చకు ఇది మరింత ఆజ్యం పోసింది.

- Advertisement -