సారీ చెప్పిన రజత్ కుమార్..

226
rajath kumar
- Advertisement -

ఓట్ల గల్లంతుపై స్పందించారు ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. ఎన్నికల్లో 69.1 శాతం పోలింగ్ నమోదైందని చెప్పిన రజత్ కుమార్ ఓట్ల గల్లంతుకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. దీనిపై విచారణ జరిపిస్తామని పార్లమెంట్ ఎన్నికల నాటికి తప్పులు సరిదిద్దుతామన్నారు.గుత్తా జ్వాల పేరు 2015లోనే జాబితా నుంచి గల్లంతయిందని రజత్ కుమార్ చెప్పారు.

2016,2017 జాబితాల్లో కొన్ని పేర్లు మిస్ అయ్యాయి. 2018 జనవరి జాబితాలో కూడా పేర్లు గల్లంతయ్యాయి. సెప్టెంబర్ 10 లిస్ట్ లో లేదు. ఆ సమయంలోనే ప్రచార కార్యక్రమాలు రూపొందించాం. అప్పుడు పేర్లు గల్లంతైన వారు ఓటు నమోదు చేసుకోలేదు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 5 వరకు చెక్ యువర్ నేమ్ పేరుతో క్యాంపెయిన్ చేశామని దాన్నీ ఉపయోగించుకోలేదన్నారు.

డిసెంబర్ 26 నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 2014 ఎన్నికల్లో 69.5 శాతం ఓటింగ్ నమోదైందని, ఈ సారి కూడా అదే రీతిలో పోలింగ్ జరిగిందన్నారు. పోలింగ్ సందర్భంగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు.

- Advertisement -