చిరు ఎనర్జీ సూపర్బ్: రాజమౌళి

547
chiru rajamouli
- Advertisement -

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి సైరా ట్రైలర్ రిలీజైన సంగతి తెలిసిందే. విడుదలైన కొద్దిగంటల్లోనే 50 లక్షల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతుండగా చిరు డైలాగ్‌లును ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. 3 లక్షల 18 వేల మంది లైక్‌ కొట్టగా వేలాదిమంది షేర్ చేస్తూ సైరా ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు.

ఈ నేపథ్యంలో సైరా ట్రైలర్‌ చూసి ఫిదా అయ్యాడు దర్శకధీరుడు రాజమౌళి. సైరా ట్రైలర్ థ్రిల్లింగ్‌గా ఉందని..దర్శకుడు సురేందర్ రెడ్డి కష్టం తెరపై స్పష్టంగా కనపడిందని ట్విట్ చేశారు. నిర్మాతగా చరణ్ కష్టపడ్డాడని…నిర్మాణ విలువలు సూపర్బ్ అని పేర్కొన్నారు. ఇక చిరంజీవికి దండం పెడుతున్న ఎమోజీని పోస్టు చేసిన జక్కన్న… మెగాస్టార్ నటనను పొగడాలంటే పదాలే లేవని కొనియాడారు. అద్భుత నటన,సూపర్బ్ ఎనర్జీతో ఇరగదీశాడని పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవికి రాజమౌళి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. అంతేగాదు రామ్‌ చరణ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది జక్కన్నకు. గతంలో చరణ్‌తో మగధీర తీసి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన జక్కన్న ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీని తెరకెక్కిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రంపై భారీగా అంచనాలున్నాయి. బిగ్ బి అమితాబ్ ఈమూవీకి కీలక పాత్రలో నటించారు. విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్ , నయనతార, తమన్నా, నిహారిక ఈమూవీలో ముఖ్య పాత్రోల్లో నటించారు. ఈనెల 22న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్, మోహన్ లాల్, అమితాబ్, రజనీకాంత్, కమల్ హాసన్ తో పాటు పలువురు హాజరుకానున్నట్లు సమాచారం.

 

- Advertisement -