మహేశ్ బాబుతో రాజమౌళి?

447
MaheshBabuSSRajamouli
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ రామ్ చరణ్ తో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ దశలో ఉంది. 2020జులై 30న ఈసినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రకరించినట్లు తెలుస్తుంది.

ఇక మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో దర్శకుడు రాజమౌళి తన తర్వాతి మూవీపై కసరత్తులు ప్రారంభించినట్లు సమాచారం. ఇప్పటికే మహేశ్ బాబును కలిసి కధ వినిపించినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. మహేశ్ కూడా కథకు ఒకే చెప్పడంతో త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుంది.

మహేశ్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో నటిస్తున్నారు. ఈమూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈమూవీ తర్వాత రాజమౌళి మహేశ్ బాబుతో సినిమా చేయనున్నాడు. ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

- Advertisement -