సైరాకు తుది మెరుగులు దిద్దుతున్న జక్కన్న…!

186
chiru syeraa

మెగాస్టార్ చిరంజీవి- సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సైరా. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా మూవీకి సంబంధించి రోజుకోవార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో బిజీగా ఉన్న రాజమౌళి సైరా సినిమాకు పనిచేయబోతున్నాడని టీ టౌన్‌లో వార్త చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా తన పాత్రకు డబ్బింగ్ కూడా పూర్తిచేశారు మెగాస్టార్ చిరంజీవి .ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే సినిమాలో చాలా వరకు గ్రాఫిక్స్, విజువల్ వండర్స్ ఉంటాయి. సైర నరసింహారెడ్డి చేసే యుధ్దాలు విజువల్ ఎఫెక్ట్స్ బాగా ఎక్కువగా కనిపించనున్నాయి. దీంతో చిరు రాజమౌళి సహాయం తీసుకోవాలని చిత్రయూనిట్ నిర్ణయించిందట.

అంతేగాదు చిరు సైతం రాజమౌళికి సినిమా చూపించి గ్రాఫిక్స్ ఎలా చేయించాలో సలహాలు తీసుకోవాలనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. రాజమౌళి కూడా సైరాకు తుది మెరుగులు దిద్దేందుకు ఒప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా సైరాతో ఇండస్ట్రీని షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు మెగాస్టార్‌.