‘రాజా.. మీరు కేక’ సాంగ్‌ లాంచ్‌..

41

ఆర్‌కె స్టుడీయోస్‌ “గుంటూరు టాకీస్” సినిమా తర్వాత నిర్మించిన రెండవ చిత్రం “ రాజా మీరు కేక “ “సంద్రమే స్నేహమై” సాంగ్ లాంచ్ ఈరోజు ప్రముక దర్శకులు “రాఘవేంద్రరావు” చేతులు మీదుగా జరిగినది. ఈ సందర్బంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ, దర్శకుడిగా తన మొదటి సినిమా విజయం సాదించాలని ఆకాంక్షిస్తూ, దర్శకులు కృష్ణ కిశోర్, నిర్మాత రాజ్ కుమార్ మరియు ఈ సినిమాలో నటించిన నటీనటులకు అబినందనలు తెలియచేసారు.

చిత్ర నిర్మాత రాజ్ కుమార్ మాట్లాడుతూ తమ మొదటి సినిమా గుంటూరు టాకీస్ విజయం తర్వాత నిర్మించిన “రాజా మీరు కేక” సినిమా ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుందని మరియు తమ సంస్థకు మరొక అద్భుత విజయాన్ని అందిస్తుందని ఆసిస్తూ ఈ సినిమాలో నటించిన నటినటులు రేవంత్, నోయెల్, హేమంత్, లాస్య శోభిత లకు మరియు ముఖ్య పాత్రలో నటించిన నందమూరి తారకరత్నకి కృతజ్ఞతలు తెలుపుతూ, తమ సినిమా ఫ్రెండ్షిప్ సాంగ్ ని లాంచ్ చేసిన దర్శకులు “రాఘవేంద్రరావు”కి దన్యవాదాలు తెలిపారు.

Raja Meeru Keka Movie Song Launch by K.Raghavendra Rao

చిత్ర దర్శకుడు కృష్ణ కిశోర్ మాట్లాడుతూ తన మొదటి సినిమా సాంగ్ లాంచ్ చేయడం ఎంతో సంతోషం కలిగించిందని చెబుతూ రాఘవేంద్రరావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు సహకరించిన నటినటులకు, సాంకేతిక నిపుణులకు దన్యవాదాలు తెలిపారు.

ఈ సినిమాలో నటించిన నటినటులు రేవంత్, నోయెల్, లాస్య మాట్లాడుతూ మంచి సినిమాను ప్రేక్షక దేవుళ్ళు ఎప్పుడూ ఆదరిస్తూ వచ్చారని, ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటూ, తమకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రాజ్ కుమార్, దర్శకులు కృష్ణ కిశోర్ మరియు సాంగ్ లాంచ్ చేసిన రాఘవేంద్రరావుకు దన్యవాదాలు తెలిపారు. ప్రొడ్యూసర్ : రాజ్ కుమార్.యమ్‌, డి.పి.ఓ: రామ్ పి.రెడ్డి, సంగీతం: శ్రీచరన్, ఆర్ట్: మారేష్ శివన్, స్టన్‌ట్స్‌: జాషువ, ఎడిటర్: యస్‌బి. ఉద్ధవ్