‘ఒరేయ్.. బుజ్జిగా’ అంటు వస్తున్న రాజ్ తరుణ్..!

215

‘ఏమైంది ఈవేళ’, ‘అధినేత’, ‘బెంగాల్‌ టైగర్‌’, ‘పంతం’ వంటి సూపర్ హిట్‌ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేమ్ కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న కొత్త చిత్రం, ‘ఒరేయ్.. బుజ్జిగా’.

యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రంలో వాణి విశ్వనాధ్, నరేష్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్య పత్రాలు పోషిస్తున్నారు.

Raj Tharun

ఈ చిత్రం గురించి నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ, ” రాజ్ తరుణ్, కొండా విజయ్‌కుమార్‌ కాంబినేషన్‌లో మా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ ‘ప్రొడక్షన్ నెం 8’ ప్రారంభించాం. ఈ చిత్రానికి ‘ఒరేయ్.. బుజ్జిగా’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశాం. ఈ రోజు నుండి నాన్ స్టాప్‌గా షూటింగ్ జరుగుతుంది. మా బ్యానర్‌లో ‘ఒరేయ్.. బుజ్జిగా’ మరో మంచి హిట్ చిత్రం అవుతుంది.” అన్నారు

సెప్టెంబర్ 10 నుండి నిరవధికంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి,సంగీతం: అనూప్ రూబెన్స్, ఫోటోగ్రఫీ: ఐ ఆండ్రూ బాబు, డాన్స్: శేఖర్, ఆర్ట్: రాజ్ కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం శ్రీనివాస రావు (గడ్డం శ్రీను), కో-డైరెక్టర్: వేణు కురపాటి,సమర్పణ: శ్రీమతి లక్ష్మి రాధామోహన్,నిర్మాత: కె కె రాధామోహన్,కథ, స్క్రీన్‌ప్లే,మాటలు, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.