ధర్మశాలలో భారీ వర్షం..తొలి టీ20 రద్దు

330
dharmasala t20

ధర్మశాల వేదికగా భారత్‌-దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన తొలి టీ20 రద్దైంది. భారీ వర్షం కురవడంతో మైదానం నిండుకుండలా మారిపోయింది. నీటిని తొలగించేందుకు గ్రౌండ్ సిబ్బంది ఎంత కష్టపడ్డ ఫలితం లేకపోయింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ రద్దైనట్లు ప్రకటించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టి20 ఈ నెల 18న బుధవారం మొహాలీలో జరుగనుంది.

వచ్చే ఏడాది టి20 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని లభించిన నాలుగైదు అవకాశాల్లోనే తమను తాము నిరూపించుకోవాలని జట్టులోని కుర్రాళ్లకు విరాట్‌ కోహ్లి సూచించాడు. కెరీర్‌ ఆరంభంలో తనకూ ఇలాంటి పరిస్థితే ఎదురైందని…ప్రస్తుతం తీవ్ర పోటీ వాతావరణంలో ఉన్నామని ఉన్న అవకాశాలనే ఒడిసిపట్టాలని సూచించారు.