అర్జున్‌ రెడ్డితో రాహుల్ మధ్యలో పునర్నవి..నాగ్ షాక్‌!

630
big boss 3
- Advertisement -

బుల్లి తెర రియాల్టీ సో బిగ్ బాస్ 3 తెలుగు సీజన్‌కి మరో వారం రోజులు మాత్రమే మిగిలిఉంది. ఆదివారం 99వ ఎపిసోడ్ ముగియగా హౌస్‌ నుంచి శివజ్యోతి ఎలిమినేట్ అయింది. దీంతో మిగిలిన ఐదుగురు సభ్యులు అలీ, రాహుల్,వరుణ్ సందేశ్,బాబా భాస్కర్,శ్రీముఖి ఫినాలేకు వెళ్లారు.వీరిలో ఒక్కరు మాత్రమే విజేతగా నిలవనున్నారు.

ఇక దీపావళి సందర్భంగా హౌస్ మెట్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్. బిగ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ…సీక్రెట్ రూమ్‌లో హౌస్‌మేట్స్‌తో మాట్లాడాడు. హౌస్‌లో జరిగిన ఓ సీక్రెట్‌ను తనతో పంచుకోవాలని చెప్పగా ఒక్కొక్కరు హౌస్ సీక్రెట్‌లను విజయ్‌తో చెప్పారు.

ఈ నేపథ్యంలో రాహుల్ సిప్లిగంజ్ ఓ రొమాంటిక్ సీక్రెట్‌ను విజయ్‌తో పంచుకున్నాడు. అది పునర్నవి గురించి కావడంతో హాట్‌ టాపిక్‌గా మారింది. కాకరకాయ జూస్‌ టాస్క్‌లో పునర్నవిని ముద్దుపెట్టిన విషయం మాత్రమే అందరికి తెలుసని కానీ ఓ టాస్క్‌లో పునర్నవి కోపంతో తన చేతిని కొరికి పారిపోయిందని సీక్రెట్ బయటపెట్టాడు. ఇది హౌస్‌లో ఎవరికీ తెలియదని తెలిపాడు రాహుల్. దీంతో నాగ్ షాకయ్యారు. వితిక గిచ్చితే రచ్చ చేశావవు కానీ పునర్నవి కొరికితే సైలెంట్‌గా ఉన్నావా నాగ్ ప్రశ్నించగా రాహుల్ ముసిముసి నవ్వులు నవ్వుతూ వెళ్లిపోయాడు.

ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో హౌస్ మెట్స్ తో కలిసి సందడి చేయనుంది యాంకర్ సుమ. దీనికి సంబందించిన లేటెస్ట్ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.

- Advertisement -