రొమాంటిక్‌ సీన్‌ లీక్‌.. రాధికా ఆప్టే ఆగ్రహం..

173
Radhika Apte

హీరోయిన్ రాధికా ఆప్టే నటించిన తాజా ఆంగ్ల చిత్రం ‘ద వెడ్డింగ్‌ గెస్ట్‌’ ఈ చిత్రంలో ఆమె సరసన దేవ్ పటేల్(స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్) హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ విడుదలకు సిద్ధంకాగా, రాధికా ఓ శృంగారం సన్నివేశం లీకై నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ సీన్‌లో రాధికా ఆప్టే, దేవ్ పటేల్ న్యూడ్‌గా కనిపిస్తున్నారు. ఇక ఈ సీన్ లీక్ కావడంపై రాధికా ఆప్టే తీవ్రంగా మండిపడింది. ‘ఈ సినిమాలో ఎన్నో అందమైన దృశ్యాలు ఉన్నాయి. కానీ శృంగారానికి సంబంధించిన సీన్‌ను మాత్రమే లీక్‌ చేశారు. దీనికి కారణం మన సమాజం సైకోటిక్‌ మెంటాలిటీనే’ అని అన్నారు.

Heroine Radhika Apte

‘లీకైన ఆ సీన్‌లో రాధికా ఆప్తే, దేవ్‌ పటేల్‌ ఇద్దరూ ఉన్నారు. కానీ, నా పేరు మీదనే ఆ సీన్‌లను స్ప్రెడ్‌ చేస్తున్నారు. మేల్‌ నటుడు దేవ్‌ పటేల్‌ పేరు మీద వాటిని స్ప్రెడ్‌ చేయవచ్చు కదా’ అని ఆమె ప్రశ్నించారు. సినిమాల్లో నగ్న, శృంగార సన్నివేశాల్లో నటించడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో రాధికా ఆప్తే పేర్కొన్న సంగతి తెలిసిందే.

బోల్డ్ సీన్లలో నటించేందుకు తానేమీ భయపడబోనని, చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూనే పెరిగానని, నటులు వేదికపై నగ్నంగా నటించడాన్ని కూడా తిలకించానని పేర్కొంది. తన శరీరాన్ని చూసి తానెందుకు సిగ్గుపడాలని ప్రశ్నించిన ఆమె, ఓ నటిగా అవసరమనిపిస్తే ఎలాగైనా నటిస్తానని ఓ వెబ్ సైట్‌కు ఇంటర్వ్యూ లో ఆమె వెల్లడించింది.