రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందిః హోంమంత్రి

488
Rachakonda
- Advertisement -

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందన్నారు హోంమంత్రి మహమ్మద్ అలీ. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో 56 ఎకరాల్లో నిర్మించనున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం (కాంపౌండ్ వాల్)కి రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మహమూద్ ఆలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో అమలులో ఉన్న ఫ్రెండ్లీ పోలీసింగ్ పేద ప్రజలకు మానవీయకోణంలో అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. మేడిపల్లిలో 56 ఏకరాల్లో నిర్మించనున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ దేశానికి తలమానికంగా నిలుస్తుందన్నారు.ఈ భవనంలో రాచకొండ పరిధిలోని నలభై నాలుగు పీఎస్ ల‌ పరిధిలోని పోలీసు సిబ్బంది కార్యకలాపాల కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నారన్నారు.

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పనితనం ఉత్తమంగా ఉందన్నారు. పోలీస్ కుటుంబాలకు ఆర్మీ స్కూల్స్ లా ఇక్కడి పోలీస్ కుటుంబ పిల్లలకి ఉన్నత రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి హోమ్ గార్డ్ పిల్లల నుండి డీజీపీ స్థాయి పిల్లల వరకు ఉన్నత విద్యను అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధి తన పరిధిలో ఉన్నందుకు కేంద్రం నుండి కూడా నిధులు విడుదలకు కృషి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు చామకూర మల్లారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డి, డిజిపి మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేష్ భాగవత్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, మేడ్చల్ జడ్పీ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రా రెడ్డి, రంగారెడ్డి జడ్పీ ఛైర్మన్ తీగల అనితా రెడ్డి, యాదాద్రి భువనగిరి జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి, పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్, ఎండి మల్లారెడ్డి, సైబరాబాద్ సిపి సజ్జనార్, రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబుతో పాటు పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

- Advertisement -