గెరిల్లా తరహా పోరాటంలో రానా..!

316
rana

రానా కథానాయకుడిగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం `విరాటప‌ర్వం`.ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఎమ‌ర్జెన్సీ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. గత సంవత్సరం డిసెంబర్‌ 14న రానా పుట్టిన రోజున ఈ సినిమా నుంచి రానా లుక్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్‌ ప్రేక్షకులను ఎంతగానో అకట్టుకుంది.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళలో శరవేగంగా జరుగుతోంది. అడవిలోని దట్టమైన అడవుల నేపథ్యంలో రానా.. తదితరులపై గెరిల్లా తరహా పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఈ యాక్సన్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి, టబు, ఈశ్వరీరావు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా .. తన పాత్ర తన కెరియర్లో చెప్పుకోదగినవిగా గుర్తుండిపోతాయని రానా భావిస్తున్నాడు.

virataparvam