అంజలి, లక్ష్మీ రాయి ప్రధానపాత్రల్లో ఆనంద భైరవి..!!

545
anjali raai laxmi
- Advertisement -

అంజలి, లక్ష్మీ రాయి ప్రధానపాత్రలో ఆదిత్ అరుణ్ ప్రత్యేక పాత్రలో “ఆనంద భైరవి” చిత్రం హరి వేన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఇటికేల రమేష్ రెడ్డి నిర్మాతగా రూపొందుతుంది.. కర్రీ బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసుకుంది.. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత ఇటికేల రమేష్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ అందమైన విశాఖపట్నంలో ఓ అందమైన జంట అంజలి, ఆదిత్ అరుణ్ లపై దర్శకుడు కర్రీ బాలాజీ చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి.. పృథ్వీ, బహ్మాజి, గుండు సుదర్శన్, జయవాణి లపై చిత్రీకరించిన కామెడీ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి.. భారీ వ్యయంతో ఎక్కడా రాజీ పడకుండా ఈ షెడ్యూల్ ని తీశామని, తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉంటుందని తెలియపరిచారు..

దర్శకుడు కర్రీ బాలాజీ మాట్లాడుతూ ఆనందిని పాత్రలో అంజలి ఒదిగిపోయారు, ఆ పాత్ర కోసం అంజలి చాల వర్క్ అవుట్స్ చేసి స్లిమ్ అయ్యారు.. ఆనందిని పాత్రని అంజలి ప్రేమించిన విధానం, ఒక ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా తన హావా భావాల్ని ఆ పాత్రలో ప్రదర్శిస్తున్నప్పుడు చూసి ఆశ్చర్య పోయానని , ఆనందిని పాత్ర కోసం స్కూటీ రైడ్ చేస్తున్న సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు స్కూటీ కిందపడి ఆమెకు గాయాలయ్యాయి, అయినా సరే లెక్క చేయకుండా షూటింగ్ లో పాల్గొనడం తో ఆమెకు వర్క్ పట్ల ఉన్న దీక్షని చూసి ఆమెకు ఫ్యాన్ అయిపోయాను.. ఆమె సరసన ఆదిత్అరుణ్ ముచ్చట గా ఉన్నాడు, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూస్తే ఈ చిత్ర యొక్క విజయం నా కాళ్ళ ముందు కనిపిస్తుంది..కెమెరా మెన్ PG విందా పనితనం మణిశర్మ గారి మ్యూజిక్ నిర్మాత రమేష్ రెడ్డి గారి ప్రోత్సాహం నన్ను మరింత ప్రోత్సాహపరిచాయి, తదుపరి జరిగే షెడ్యూల్ లో లక్ష్మీ రాయి పై యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరించడానికి ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నాను అన్నారు..

నటీనటులు : అంజలి , లక్ష్మీ రాయ్ , ఆదిత్ అరుణ్, సుమన్, బ్రహ్మాజీ, మురళి శర్మ, జయప్రకాశ్ , కళ్యాణి, ఆశిష్ విద్యార్థి, పృథ్వీ, గుండు సుదర్శన్, జయవాణి, గిరి, మణిచందన, ప్రభాస్ శ్రీను, సుబ్బరాయ శర్మ, ధన్ రాజ్, ఐశ్వర్య, విద్యుల్లేఖరామన్, బాహుబలి ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, పర్వీన్ రాజ్, దినేష్, రాహుల్, సాత్విక్, శ్రీ హర్ష తదితరులు…సాంకేతిక నిపుణులు : స్కిప్ట్ కో ఆర్డినేటర్ : మధు విప్పర్తి,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సురేష్ దత్తి,ఎడిటింగ్ : చోట కె ప్రసాద్,కెమెరా : పీజీ విందా,
మ్యూజిక్ : మణిశర్మ ,ప్రొడ్యూసర్ : ఇటికేలా రమేష్ రెడ్డి ,కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం : కర్రీ బాలాజీ..

- Advertisement -