కోహ్లీకి సింధు..సేఫ్‌ హ్యాండ్స్ ఛాలెంజ్

83
sindhu

కరోనా వైరస్‌ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు,సూచనలపై ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. కరోనాపై మరింత అవగాహన పెంచేందుకు సినీ,క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు వీడియో సందేశాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌ తెరమీదకు వచ్చింది. హైదరాబాద్‌లో అమెరికా కాన్సుల్ జనరల్ కేథరిన్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించింది షట్లర్ పీవీ సింధు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కచ్చితంగా తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పింది.

ఈ సందర్భంగా మరో ముగ్గురికి సింధు సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ ఇచ్చింది సింధు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలకు ఈ ఛాలెంజ్ విసిరింది.