మేరికి పద్మ విభూషణ్..సింధుకు పద్మభూషణ్‌

590
pv sindhu
- Advertisement -

దేశంలో మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు కోసం తెలుగుతేజం, బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ పీవీ సీంధు పేరును క్రీడా శాఖ ప్రతిపాదించింది. సింధుకు పద్మభూషణ్‌ అవార్డును ఇవ్వాలంటూ, కేంద్రానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పద్మ పురస్కారాల గ్రహీతల పేర్లను కేంద్రం ప్రకటించనుంది.

తొలిసారిగా క్రీడా శాఖ పూర్తిగా మహిళలతోనే సిఫార్సు జాబితాను తయారు చేసినట్టు తెలుస్తోంది. ఆరుసార్లు వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ గా నిలిచిన మేరీ కోమ్‌ను పద్మ విభూషణ్‌ అవార్డుకు క్రీడా శాఖ సిఫార్సు చేసినట్టు సమాచారం. ఇక క్రికెటర్ హర్మన్ ప్రీత్ సింగ్, హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంఫాల్, రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రా, షూటర్ సుమా శిరూర్, మౌంటెనీర్లు తాషి, సుంగ్లీ మాలిక్ పేర్లను పద్మశ్రీకి సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది.

2017లో పద్మభూషణ్‌ పురస్కారానికి సింధు పేరు సిఫార్సు అయినప్పటికీ, అవార్డుల కమిటీ మాత్రం ఎంపిక చేయలేదన్న సంగతి తెలిసిందే. ఈ దఫా ఆమెకు పద్మభూషణ్ ఖాయమేనని తెలుస్తోంది.

మేరికోమ్‌కు 2006లో పద్మ శ్రీ,2013లో పద్మభూషణ్ అవార్డులు వరించాయి. ఇక పీవీ సింధుకు 2015లో పద్మ శ్రీ అవార్డు లభించింది.

- Advertisement -