క‌రోనాపై పోరాటం…స్పందించిన పీవీ సింధు

76
pv sindhu

క‌రోనాపై పోరాటానికి మ‌ద్ద‌తుగా త‌మ వంతు సాయం అందిస్తున్నారు సినీ,రాజ‌కీయ‌,క్రీడా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు. ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రెటీలు త‌మ‌వంతు సాయం ప్ర‌క‌టించగా తాజాగా పీవీ సింధు ముందుకొచ్చింది.

తెలంగాణ‌, ఏపీ ప్ర‌భుత్వాల‌కు త‌న‌వంతు సాయంగా చెరో రూ. 5 ల‌క్ష‌ల‌ను ప్ర‌క‌టించింది. తెలుగు సీఎంల రిలీఫ్ ఫండ్‌కు ఈ స‌హాయ‌నిధిని అంద‌జేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది సింధు. క‌రోనాపై పోరాటానికి ఈ నిధుల‌ను ఉపయోగించుకోవాలని పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి పైగా ఈ వైర‌స్ బారిన ప‌డ‌గా 21 వేల మందికి పైగా ప్రాణాలు విడిచారు. ఇక భార‌త్‌తో ఇప్ప‌టివ‌రకు 650కి పైగా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 13 మంది చ‌నిపోయారు. 600 మందికిపైగా క‌రోనా పాజిటివ్‌గా తేలారు. ఇప్పటివరకు 13 మంది తన ప్రాణాలను కోల్పోయారు.