ఫోర్బ్స్‌ జాబితాలో…సింధూ

237
- Advertisement -

ఫోర్బ్స్‌ జాబితాలో భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు ఎంట్రీ ఇచ్చేసింది. ప్రపంచంలో అత్యధిక మొత్తంలో సంపాధిస్తోన్న క్రీడాకారిణీల లిస్ట్‌ ను ఫోర్బ్స్‌ ప్రకటించింది. కాగా..ఇందులో పీవీ సింధూ ఏడో స్థానంలో నిలిచింది. అంతేకాదు భారత్ నుంచి టాప్‌ -10లో నిలిచిన ఏకైక క్రీడాకారిణికూడా సింధూనే. ఇదేకాక..టెన్నిస్ క్రీడాకారిణులు కాకుండా కేవలం ఇద్దరు మాత్రమే ఈ జాబితాలో టాప్‌-10 లోనిలవగా..ఇందులో సింధూ ఉండడం విశేషం.

PV Sindhu

ఇదిలా ఉంటే..అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక టోర్నీలు ఆడటంతో అందుకునే ప్రైజ్‌ మనీతో పాటు, వాణిజ్య ఒప్పందాల ద్వారా వీరు అందుకునే మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని ఫోర్బ్స్ ఈ జాబితాలను తయారు చేసింది.

టాప్‌-10 చోటు దక్కించుకున్న క్రీడాకారిణులు.. వారు అందుకుంటోన్న మొత్తం(అమెరికా డాలర్లలో):

1. సెరెనా విలియమ్స్‌ – టెన్నిస్‌ – 18.1 మిలియన్లు

2. కరోలిన్‌ వొజ్నొకి- టెన్నిస్‌ – 13 మిలియన్లు

3. స్లోనే స్టీఫెన్స్‌ – టెన్నిస్‌ – 11.2 మిలియన్లు

4. గార్బిన్‌ ముగురుజ – టెన్నిస్‌ – 11 మిలియన్లు

5. మరియా షరపోవా – టెన్నిస్‌ – 10.5 మిలియన్లు

6. వీనస్‌ విలియర్స్‌ – టెన్నిస్‌ – 10.2 మిలియన్లు

7. పీవీ సింధు – బ్యాడ్మింటన్‌ – 8.5 మిలియన్లు

8. సిమోనా హలెప్‌ – టెన్నిస్‌ – 7.7 మిలియన్లు

9. డానిక పాట్రిక్‌ – రేస్‌ కార్‌ డ్రైవర్‌ – 7.5 మిలియన్లు

10. కెర్బర్‌ – టెన్నిస్‌ – 7 మిలియన్లు

- Advertisement -