ఇస్మార్ట్ పిక్ ఆఫ్ ది డే…

634
rgv puri
- Advertisement -

వరుస పరాజయాలతో నైరాశ్యంలో ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్‌కు ఇస్మార్ట్ శంకర్‌ కాస్త ఊరటనిచ్చింది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 16 కోట్ల వసూళ్లను రాబట్టింది. రామ్ నటన,మాస్ సన్నివేశాలు, నబా నటేష్‌,నిధి అగర్వాల్ గ్లామర్ సినిమాకు ప్లస్ కాగా సినిమా విజయంతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగితేలుతోంది.

ఈ సినిమా విజయంతో జోష్ మీదున్న పూరి ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌ని ప్రకటించారు. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా ఈసారి ట్రిపుల్ ఇస్మార్ట్ కావాలి అనగా ఇప్పటికే ‘డబుల్ ఇస్మార్ట్’ టైటిల్ రిజిస్టేర్ చేయించాను సర్ అంటూ సమాధానమిచ్చారు పూరి.

ఇక తాజాగా సినిమా సక్సెస్‌ని ఆర్జీవీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు పూరి. ఈ నేపథ్యంలో తన శిష్యుడికి ముద్దుపెడుతు విషెస్ చెప్పాడు ఆర్జీవీ. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -