ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్‌ డబుల్ ఇస్మార్ట్ : పూరి

209
puri jagannath

వరుస పరాజయాలతో నైరాశ్యంలో ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్‌కు ఇస్మార్ట్ శంకర్‌ కాస్త ఊరటనిచ్చింది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది ఈ చిత్రం. రామ్ నటన,మాస్ సన్నివేశాలు, నబా నటేష్‌,నిధి అగర్వాల్ గ్లామర్ సినిమాకు ప్లస్ కాగా సినిమా విజయంతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగితేలుతోంది.

ఈ సినిమా విజయంతో జోష్ మీదున్న పూరి ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌ని ప్రకటించారు. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా ఈసారి ట్రిపుల్ ఇస్మార్ట్ కావాలి అనగా ఇప్పటికే ‘డబుల్ ఇస్మార్ట్’ టైటిల్ రిజిస్టేర్ చేయించాను సర్ అంటూ సమాధానమిచ్చారు పూరి.

డబల్ ఇస్మార్ట్’కు సంబంధించిన స్టోరీ లైన్ పూరి జగన్నాధ్ ఇప్పటికే సిద్ధం చేసుకున్నారట. అయితే స్క్రిప్టు వర్క్ పూర్తి చేయాల్సి ఉందని తెలుస్తోంది. ఈ సీక్వెల్‌ మూవీలో హీరో ఎవరనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.