మరో వివాదంలో ఇస్మార్ట్ శంకర్..

689
iSmart Shankar Movie Trailer 2
- Advertisement -

పూరీ జగన్నాథ్ హీరో రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈనెల 18న ఈచిత్రం గ్రాండ్ గా విడుదలైంది. అంతేకాకుండా మంచి కలెక్షన్లను కూడా రాబడుతోంది. చాలా రోజుల తర్వాత పూరీ జగన్నాథ్ కు హిట్ రావడంతో టీం మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఈమూవీ మరో వివాదంలో చిక్కుకుంది. ఈ కథ తనదే అంటున్నారు తమిళ నటుడు ఆకాశ్. ఈ చిత్ర కథ తాను రూపొందించిన ‘నాన్‌ యార్‌’ అనే తమిళ చిత్రాన్ని పోలి ఉందంటున్నారు.

ఒకరు ఆలోచనలను మరోమరొకరి మెదడులోకి పంపితే ఏం జరుగుతుంది అనే దానిపై సినిమా తీస్తున్నానని చెప్పారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ పేరుతో అనువదిస్తున్నామని… త్వరలో విడుదల చేద్దామనుకుంటున్న తరుణంలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చూసి ఆశ్చర్యపోయానిని చెప్పారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు నా కథకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఈ విషయమై తమిళ నిర్మాతల మండలిలో పూరి జగన్నాథ్‌పై ఫిర్యాదు చేశా. సమస్య పరిష్కారం కాకపోతే న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. మరీ ఈవివాదంపై పూరీ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -