యాదాద్రిలో ఆంధ్రజ్యోతిపై నిరసన..!

513
andhra jothi
- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంపై తప్పుడు రాతలు రాసిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ తీశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం అన్యాయమంటు ఆంధ్రజ్యోతి పత్రికలను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ నేతలు,కార్యకర్తలు ఆంధ్రజోతి ఢం ఢం అంటూ నినాదాలు చేశారు.

trs

యాదాద్రి ఆలయ ప్రధానార్చకులు నల్లందిగళ్ నరసింహచార్యులు మాట్లాడుతూ.. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా అపచారాలు జరిగాయని ఆంధ్రజ్యోతి పత్రిక బ్యానర్ కథనం రాయడం చాలా బాధగా ఉన్నది. కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బ తినెల వార్తలను ఆంధ్రజ్యోతి ప్రచురించింది అది తప్పు. గర్భాలయంలో స్వామి వారి మూల విరాట్‌కు అలాంటి అపచారం జరగలేదు.. చెక్కలేదు. సంవత్సరం క్రితమే మూల విరాట్‌కు ఉన్న సింధురాన్ని తొలగించాము. దీనితో స్వామి వారు దేదీప్యమానంగా కనబడుతున్నారు.

40 సంవత్సరం లుగా స్వామి వారికి కైకిర్యలను చేస్తున్నాను. స్వామి వారికి ఎలాంటి కళంకం జరగలేదు. తిరుపతిలో, శ్రీశైలంలలో పెద్ద ఆలయాలలో కూడా స్వామి వార్ల మూల విరాట్‌లపై ఉన్న చందనాన్ని, సింధురాన్ని అప్పుడప్పుడు శుభ్రం చేస్తారు. ఇది సర్వ సాధారణమైన విషయమని.. ఆంధ్రజోతి పత్రిక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని ప్రధానార్చకులు అన్నారు.

yadhadri

Protest Against Andhrajyothi in Yadadri Bhuvanagiri district..Protest Against Andhrajyothi in Yadadri Bhuvanagiri district..

- Advertisement -