బిగ్ బాస్3లోకి బండ్ల గణేశ్..

83
Bandla Ganesh

బిగ్ బాస్ షోకు బుల్లితెరపై మంత్రి క్రేజ్ ఏర్పడింది. తెలుగు రెండు సిజన్లు విజయవంతంగా పూర్తి చేసకున్న ఈషో త్వరలోనే మూడవ సీజన్ ప్రారంభం కానుంది. ఇందుకోసం బిగ్ బాస్ నిర్వాహకులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా సెట్ ను వేశారు. ఈ షోలో పాల్గోనే పార్టీసిపెంట్స్ పేర్లు కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. ఈలిస్ట్ లో ఓ ప్రముఖ నిర్మాత పేరు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

నిర్మాత బండ్ల గణేశ్ బిగ్ బాస్ 3లోకి వెళ్లనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే తాను ఈషోలో పాల్గోనాలంటే బిగ్ బాస్ నిర్వాహకులకు కొన్ని కండీషన్లు పెట్టారట బండ్ల గణేశ్. వీలయినంత వరకు తనకి ఫోన్ అందుబాటులో వుండాలని, కుటుంబ సభ్యలతో టచ్ లో వుండే అవకాశం వుండాలని బండ్ల గణేష్ కోరినట్లు తెలుస్తొంది. అందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ఒప్పుకోకపోవడంతో బండ్ల గణేశ్ ను లైట్ తీసుకున్నారట.