ప్రో కబడ్డీ లీగ్…షెడ్యూల్ మీకోసం

930
pro kabaddi league
- Advertisement -

క్రికెట్ సంగ్రామం ముగిసింది. క్రీడాభిమానులకు మరిన్ని సరదాలు పంచడానికి ప్రో కబడ్డీ సిద్దమైపోయింది. ఈనెల 20(రేపటి) నుంచి ఏడో సీజన్ ప్రారంభంకానుండగా ఈసారి మొత్తం 12 టీములు పాల్గోబోతున్నాయి.

హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియంలో శనివారం నుంచి ఈ ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ లు ప్రారంభం కాబోతున్నాయి. హైదరాబాద్, ముంబయి, పాట్నా, అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, పూణే, జైపూర్, పంచకుల(హర్యానా),గ్రేటర్ నోయిడా ల్లో లీగ్ మ్యాచ్ లు నిర్వహిస్తారు. లీగ్ మ్యాచ్ లు అక్టోబర్ 11 తో ముగుస్తాయి. అనంతరం అక్టోబర్ 14 న రెండు ప్లే ఆఫ్ మ్యాచ్ లు, 16 న రెండు సెమీఫైనల్స్ జరుగుతాయి ఫైనల్స్ అక్టోబర్ 19 న నిర్వహిస్తారు.

ఆరేళ్ళ క్రితం 2014లో 8 టీములతో మొదటి ప్రో కబడ్డీ ప్రారంభం అయింది. తెలుగు టైటాన్స్ రెండు సార్లు సెమీఫైనల్స్ కు చేరగా ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది.

kabaddi schedule

- Advertisement -