ప్రో కబడ్డి 7 విజేత బెంగాల్ వారియర్స్

163
Bengal-Warriors

ప్రో కబడ్డి లీగ్ లో బెంగాల్ ఢిల్లీ టీం లు ఫైనల్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఉత్కంఠ పోరులో బెంగాల్ తొలిసారిగా విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా శనివారం రాత్రి దబాంగ్ ఢిల్లీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 39-34 తేడాతో గెలిచిన బెంగాల్ టీమ్.. తొలిసారి టైటిల్‌ని ముద్దాడింది. ఈ ఫైనల్‌తో ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ ముగిసింది.

ఫైనల్‌ మ్యాచ్ ఆరంభంలోనే ఒత్తిడికి గురైన బెంగాల్ వారియర్స్ పాయింట్ల ఖాతా తెరిచేలోపే దబాంగ్ ఢిల్లీ 6-0తో ఆధిక్యంలో నిలిచింది. కానీ.. ఈ దశలో కెప్టెన్ మహ్మద్ వరుస రైడ్ పాయింట్లతో బెంగాల్ వారియర్స్‌ని మళ్లీ మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. మ్యాచ్‌లో 13 సార్లు రైడ్‌కి వెళ్లిన మహ్మద్ 9 పాయింట్లతో ఆకట్టుకోగా.. డిఫెన్స్‌లో జీవా 4 పాయింట్లతో సత్తాచాటాడు.టైటిల్ పోరులో బెంగాల్ వారియర్స్ 39-34తో దబాంగ్ ఢిల్లీ జట్టుపై జయభేరి మోగించింది.