చిదంబరంకు మద్దతుగా ప్రియాంకా గాంధీ

328
- Advertisement -

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈకేసుకు సంబంధించి చిదంబరం ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును సంప్రదించగా బెయిల్ నిరాకరించింది. దీంతో అతని కోసం ఈడీ, సీబీఐ అధికారులు ఎదురుచూస్తున్నారు.

ఈవిషయంలో తనకు అండగా నిలిచారు కాంగ్రెస్ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా . గౌరవ రాజ్యసభ సభ్యుడైన చిదంబరం దేశం కోసం కొన్ని దశాబ్దాల తరబడి విధేయుడిగా పనిచేస్తున్నాడని ప్రియాంక అన్నారు.ఈ క్రమంలో కేంద్రమంత్రిగానూ, ఆర్థికమంత్రిగానూ సేవలందించారని గుర్తుచేశారు. చిదంబరం నిజాలు మాట్లాడుతారని..అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతారని చెప్పారు.

ఆయన చెప్పే నిజాలు జీర్ణించుకోలేక ఏం చేయాలో తెలియక పాత కేసులతో వెంటాడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నందునే చిదంబరంపై కక్ష గట్టి కేసులతో వేధిస్తున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. చిదంబరానికి పార్టీతో తామంతా అండగా నిలుస్తామని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు చిదంబరం అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆయన కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరెట్ (ఈడీ) అధికారులు ఎదురుచూస్తున్నారు.

priyanka gandhi Tweet

- Advertisement -