ప్రియా వారియర్‌కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..!

316
Priya Prakash Varrier

ప్రియా వారియర్ ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది.’ఒరు ఆదార్ లవ్’ సినిమా విడుదలకి ముందే ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఆమె డీలా పడిపోలేదు. తనకి వచ్చిన క్రేజ్ ను కొత్త అవకాశాలతో నిలబెట్టుకోవడానికి ఆమె తనవంతు ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ప్రియా వారియర్‌ కన్నడంలో ‘విష్ణు ప్రియ’ అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రం విడుదలకు సిద్దం అవుతున్న నేపథ్యంలో ఒక కన్నడ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది.

Priya Prakash Varrier

ఆ సందర్బంగా ఆమెను జర్నలిస్ట్ మీకు ఏ హీరో అంటే ఇష్టం.. ఎవరితో సినిమా చేయాలని కోరుకుంటారు అంటూ ప్రశ్నించారు. అప్పుడు ఆమె చాలా గడుసుగా సమాధానం చెప్పింది. నన్ను ఈ ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు. కాని నేను మాత్రం సమాధానం చెప్పను. ఎందుకంటే ఒక హీరో పేరు చెబితే మరో హీరో నుండి అవకాశాలు రావు. అందుకే ఒక్కరు ఇద్దరు హీరోల పేర్లు చెప్పాలంటే భయం అంటూ ప్రియా వారియర్ గడుసుగా సమాధానం ఇచ్చింది.