అహ్మదాబాద్ కు చేరుకున్న ప్రధాని మోదీ

145
pmmodiahmd

మరికాసేపట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  అహ్మదాబాద్ కు రానున్నారు. ఈనేపథ్యంతో ట్రంప్ కు స్వాగతం పలికేందుకు అహ్మదాబాద్ కు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు ప్రధాని మోదీ. ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ. కాగా 11.40గంటలకు ట్రంప్ దంపతులు ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ కు చేరుకోనున్నారు. ట్రంప్ రాక కోసం అహ్మదాబాద్ వాసులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మొదటిసారిగా ట్రంప్ ఇండియాకు వస్తుండటంతో చాలా ఆసక్తి నెలకొంది. భారత్ పర్యటనుక సంబంధించి ప్రతి విషయాన్ని తన ట్వీట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు ట్రంప్. దారిలో ఉన్నా.. మరి కొద్ది గంటల్లో మీ అందర్నీ కలుస్తాననీ.. భారత్‌కు ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఎదురు చూస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో అహ్మదాబాద్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమెరికా అధ్యక్షుడు ప్రారంభించనున్న మొతెరా స్టేడియం జనాలతో నిండిపోయింది.