ఏఎన్నార్ అవార్డ్ లను ప్రకటించిన నాగార్జున

463
nagarjuna
- Advertisement -

నటసామ్రట్ అక్కినేని నాగేశ్వరరావు పేరుతో నిర్వహించే ప్రతిష్టాత్మక ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ లను ప్రకటించారు అక్కినేని నాగార్జున. 2018, 2019 సంవత్సరాలకు గాను ఏఎన్నార్ పురస్కారాలను నాగార్జున ప్రకటించారు. సినీ నిర్మాత, రాజకీయవేత్త సుబ్బరామిరెడ్డితో కలసి ఈరోజు మీడియా సమావేశంలో పురస్కార విజేతల పేర్లను ప్రకటించారు. ఈసందర్భంగా నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ కార్యక్రమం నవంబర్ 17, సాయంత్రం 5 గంటలకు, అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా జరుగనున్నట్లు తెలిపారు.

anr

2018వ సంవత్సరానికిగాను దివంగత శ్రీదేవికి, 2019 ఏడాదికిగాను సీనియర్ నటి రేఖకు అవార్డులను అనౌన్స్ చేశారు. శ్రీ దేవి అవార్డును ఆమె భర్త బోనీ కపూర్ అందుకోనున్నారు. ఆయనతో పాటు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ కుడా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డులను అందించనున్నట్లు తెలిపారు. మరోవైపు అదే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ లో ‘అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా’ మూడవ స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రేఖ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు.

- Advertisement -