మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన..!

590
president rule
- Advertisement -

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కొనసాగుతునే ఉంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో తొలుత బీజేపీకి తర్వాత శివసేనకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు గవర్నర్. బీజేపీ తిరస్కరించగా శివసేన …కాంగ్రెస్‌,ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సమయంలో ఎన్సీపీకి ఇవాళ రాత్రి 8.30 గంటల వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఇచ్చిన గవర్నర్ లేనిపక్షంలో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారసు చేశారు.

మహారాష్ర్టలో రాష్ర్టపతి పాలన విధిస్తారని వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో గవర్నర్ తీరుపై శివసేన మండిపడుతోంది. రాష్ర్టపతి పాలన విధిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు శివసేన సిద్ధమవుతుంది.

నిన్న శివసేనకు గడువు విధించిన గవర్నర్ కోశ్యారీ ఇవాళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)కి విధించారు. బీజేపీ, శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో.. ఎన్సీపీని గవర్నర్ ఆహ్వానించారు. మంగళవారం రాత్రి 8:30 గంటల వరకు ఎన్సీపీకి గవర్నర్ గడువిచ్చారు.

- Advertisement -