ట్రెండింగ్ లో ప్రతిరోజ పండగే..

258
pratiroju pandage

సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా, మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా, గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిస్తున్న భారీ చిత్రం “ప్రతిరోజు పండగే”. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇక ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసింది. ఈ ట్రైలర్‌తో ఆకట్టుకున్నారు సాయిధరమ్..దర్శకుడు మారుతి.

ఇప్పటివరకు 15 లక్షల మంది వీక్షించడమే కాదు 78 వేల లైకులతో యూ ట్యూబ్‌ ట్రెండింగ్‌లో మొదటిస్ధానంలో ఉంది.అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాలు,విలువల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి..

Presenting you the Trailer of #PratiRojuPandaage Movie Ft #SaiTej, #RaashiKhanna, #SatyaRaj, #RaoRamesh & Others.Directed by Maruthi