మెగా హీరో కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనర్‌..!

564
sai tej
- Advertisement -

ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కాన్సెప్ట్‌తో సంక్రాంతికి ముందు వచ్చిన సినిమా ప్రతిరోజూ పండగే. సాయి తేజ్, రాశీ ఖన్నా, రావు రమేశ్, సత్యరాజ్ తదితరులు నటించిన ఈ సినిమా విడుదలకు ముందు పాజిటీవ్ బజ్ ఉంది, మూవీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ లో పాజిటివిటి ఎక్కువైంది. సాయి తేజ్ నటన, రావు రమేశ్ పర్ఫార్మెన్స్, రాశీ ఖన్నా గ్లామర్ సినిమాకు కలిసి వచ్చాయి. ఎమోషన్ సీన్లు బలంగా ఉన్నాయి.

prati-roju-pandage

సినిమా విడుదలైన అన్ని సెంటర్స్ నుండి పాజిటీవ్ టాక్ వినిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో ఈ మూవీ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. అలాగే మారుతి యూవీ, గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో గతంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ సూపర్ హిట్ తరువాత ప్రతిరోజు పండగే సినిమా వారి కాంబినేషన్‌లో మరో హిట్ సినిమాగా నిలిచిందనడంలో సందేహం లేదు.

- Advertisement -