అ..! సీక్వెల్‌..ఎవరితో తెలుసా..?

311
prashanth varma

నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అ!. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి టాక్ సంపాదించుకుంది. కాజల్, నిత్యా మీనన్‌, అవసరాల శ్రీనివాస్, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ వంటి స్టార్స్‌ కీ రోల్ పోషించారు. ఈ సినిమాకు జాతీయ స్ధాయిలో రెండు అవార్డులు కూడా రావడంతో సీక్వెల్ తీసే పనిలో ఉన్నారట దర్శకుడు ప్రశాంత్‌ వర్మ.

జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అ! సినిమా సీక్వెల్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. అయితే ఈ సారి తెరకెక్కించే సినిమాలో తమిళ స్టార్లు ఉండే అవకాశం ఉందట.

స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి, కాజ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఫస్ట్ పార్ట్‌కి తీసిపోకుండా సెకండ్ పార్టుని తెరకెక్కించే పనిలో ఉన్నానని చెప్పారు ప్రశాంత్. అంతేగాదు ఫస్ట్ పార్టును వివిధ పాత్రల సమాహారంగా తెరకెక్కించగా సీక్వెల్‌ని మాత్రం ఒకే పాత్ర కథతో నడిపించనున్నారట.