సీఎం కేసీఆర్‌,జగన్‌ కోసం రంగంలోకి ప్రణబ్.!

308
kcr jagan ap news
- Advertisement -

బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా శరవేగంగా పావులు కదుపుతోంది కాంగ్రెస్‌. ఇందులో భాగంగా ప్రాంతీయ పార్టీలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు హస్తం నేతలు. ఇందులో భాగంగా దక్షిణాదిపై పూర్తిపట్టు సాధించే నేపథ్యంలో తెలంగాణ,ఏపీపై దృష్టిసారించింది. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వీక్‌గా ఉన్న నేపథ్యంలో మెజార్టీ స్ధానాలు సాధించే టీఆర్ఎస్,వైసీపీపై దృష్టిసారించింది కాంగ్రెస్ అధిష్టానం.

తెలంగాణ సీఎం కేసీఆర్,వైసీపీ అధినేత జగన్‌లను తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ఇద్దరు నేతలతో సన్నిహితంగా ఉండే నేతలను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. తెలంగాణ ఏర్పాటులో కీరోల్ పోషించిన మాజీ కేంద్రమంత్రి చిదంబరంతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో గులాం నబీ ఆజాద్‌,మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ చర్చలు జరపనున్నట్లు సమాచారం.

మొదటి నుండి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ను రంగంలోకి దించితే ఫలితం ఉంటుందని హైకమాండ్ భావిస్తోంది. జగన్‌తో పాటు సీఎం కేసీఆర్‌.. ప్రణబ్‌కు మధ్య సత్సంబంధాలున్నాయి. ఈ పరిచయాలే టీఆర్ఎస్,వైసీపీ నేతలు హస్తం వైపు చూసేందుకు దోహదపడతాయని హైకమాండ్ భావిస్తోంది. త్వరలోనే ఈ నలుగురు హస్తం నేతలు కేసీఆర్‌,జగన్‌లతో చర్చలు జరపున్నట్లు సమాచారం. మొత్తంగా హస్తం నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.

- Advertisement -