రంగమార్తాండ..అసిస్టెండ్ దర్శకుడు ఎవరో తెలుసా..!

297
prakash raj

చాలాకాలం గ్యాప్ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టారు క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ. మరాఠి క్లాసిక్‌ నట సామ్రాట్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి రంగ మార్తండ అనే టైటిల్‌ని ఖరారు చేయగా ఈ మూవీలో ప్రకాజ్‌ రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్‌ సిప్లిగంజ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ మొదలు కాగా సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ ఇచ్చారు కృష్ణవంశీ. తన టీంలో కొత్త అసిస్టెంట్ డైరెక్టర్‌ చేరడానే వీడియోని పోస్టు చేశారు. గాడ్ బ్లెస్ హిం అంటూ పేర్కొనగా ఇంతకీ ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరనుకున్నారా..?అతడే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్.

కృష్ణవంశీ – ప్రకాష్ రాజ్‌ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్‌. కృష్ణవంశీ తెరకెక్కించిన ప్రతీ సినిమాలో ప్రకాష్ రాజ్‌ నటించగా తాజాగా తెరకెక్కుతున్న రంగమార్తండ కోసం సాయం అందిస్తున్నారు. రంగస్థల కళాకారుడి తెర వెనక జీవితం నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Actor Prakash raj assistant director for rangamarthanda…Actor Prakash raj assistant director for rangamarthanda…