ప్రజాకూటమి ముక్కలేనా?.

340
mahakutami telangana
- Advertisement -

తెలంగాణలో ప్రజాకూటమిగా మారిన మహాకూటమి ముక్కలు కాబోతుందా..?సీట్ల సర్దుబాటు,నేతల సమన్వయ లోపంతో ప్రజాకూటమి మూడురోజుల ముచ్చటగానే మారనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్,టీడీపీ,సీపీఐ,తెలంగాణ జనసమితి కలిసి ప్రజాకూటమిగా ఏర్పాటై వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు ప్రకటించాయి. అయితే ప్రకటన వరకు బాగానే ఉన్నా ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రోజురోజుకు ప్రజాకూటమి మధ్య వైరం ముదిరిపాకాన పడుతోంది.

ప్రజాకూటమిలో కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కోదండరామ్,చాడ వెంకటరెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు కావాలని టీజేఎస్, కనీసం 8 సీట్లు కావాలని సీపీఐ గట్టి పట్టుమీద ఉండగా, టీజేఎస్ కు 5 నుంచి 7, సీపీఐకి మూడు నుంచి నాలుగు సీట్లకు మించి ఇవ్వలేమని కాంగ్రెస్ తేల్చి చెబుతోంది.

ఈ నేపథ్యంలో పలుమార్లు కాంగ్రెస్‌కు డెడ్‌లైన్లు విధించుకుంటు వచ్చిన సీపీఐ,టీజేఎస్ ఒంటరిపోరుకే రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశారని విశ్వసనీయ సమాచారం. పొత్తు కుదరకుంటే ఒంటరిగా బరిలోకి దిగేందుకు రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి. సీట్ల అంశం కొలిక్కిరాకపోవడంతో ప్రజాకూటమి ఎన్నికల్లో కలిసిపోటీ చేసే అవకాశం కలగానే మిగిలిపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -