పవన్ కళ్యాణ్ కు జోడిగా కంచె హీరోయిన్!

223
pawan Pragya

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో భారీ విజయాన్ని సాధించిన పింక్ మూవీని తెలుగు రీమేక్ చేస్తున్నారు. ఈమూవీలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. దిల్ రాజు బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈమూవీని వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈనెల 20న ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గోన్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీంతో షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిత్రయూనిట్. అంజలి, నివేధా ధామస్ లు ఈమూవీ కీలకపాత్రల్లో నటించనున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా ఉన్న సమాచారం మేరకు కంచె మూవీ హీరోయిన్ గా నటించిన ప్రజ్నా జైస్వాల్ ను తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా ఆగస్ట్ లో ఈమూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.