హీరోగా వస్తున్న యాంకర్‌ ప్రదీప్‌..!

59
anchor pradeep

ప్రస్తుతం బుల్లితెరపై రాజ్యమేలుతున్న యాంకర్స్ హీరోగా సినిమా చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తున్నారు. తెలుగు బుల్లితెరపై మేల్ యాంకర్‌గా చక్రం తిప్పుతున్న యాంకర్ ప్రదీప్ హీరోగా మారి సినిమా చేశాడు. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే టైటిల్‌తో ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవుతుంది. అయితే మొన్నటి వరకూ తను హీరోగా చేస్తున్న సంగతి బయటికి రాకుండా చూసిన ప్రదీప్ ఎట్టకేలకు ఇప్పుడు హీరోగా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు చూస్తున్నాడు.

pradeep

అయితే ఇలా యాంకర్స్‌ సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి వారి అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. వారిలో యాంకర్ రవి హీరోగా మారి ‘ఇది మా ప్రేమకథ’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా రిలీజై ఇలా వచ్చి అలా పోయింది. ఇటీవలే సుదీర్ కూడా ‘సాఫ్ట్ వేర్ సుదీర్’ అనే సినిమా చేశాడు. ఆ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా స్టార్ యాంకర్ ప్రదీప్‌ వెండి తెరపై కనిపించనున్నాడు. మరి ఈ స్టార్ యాంకరయినా హీరోగా క్లిక్ అవుతాడా చూడాలి.