ప్రభాస్‌ సెంటిమెంట్‌..బాహుబలి బాటలోనే సాహో

481
prabhas sahoo

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఈ నెల 30న సాహో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఆడియో రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరిగే ఈ ఈవెంట్‌కు బాలీవుడ్ సెలబ్రెటీలతో పాటు టాలీవుడ్‌ హీరోలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ప్రభాస్-రాజమౌళి కాంబోలో తెరకెక్కిన బాహుబలి ఆడియో రిలీజ్ వేడుక రామోజీ ఫిల్మ్‌ సిటీలోనే జరిగింది. భారతీయ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ మంచి వసూళ్లను రాబట్టి… తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది.

ఈ నేపథ్యంలో బాహుబలి సెంటిమెంట్‌ను రిపీట్ చేయాలని భావిస్తున్నారు ప్రభాస్‌. సాహో ప్రీ రీలీజ్ వేడుకను రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించడంతో సెంటిమెంట్‌ ఫాలో అవ్వడం,అందరికి అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారట. ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కగా ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది.