గ్యాంగ్‌లీడర్‌ కోసం వస్తున్న సాహో..!

299
prabhas nani

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్ లీడర్‌. విక్రమ్ కుమార్ కే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్.

ఇక తాజాగా యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ని గ్యాంగ్ లీడర్ ప్రమోషన్ కార్యక్రమాలకు రప్పించే పనిలో పడ్డారట నిర్మాతలు. వాస్తవానికి ప్రభాస్ సాహో ఆగస్టు 15న,నాని గ్యాంగ్ లీడర్ ఆగస్టు 30న విడుదల కావాల్సి ఉంది. అయితే సాహో రిలీజ్ డేట్ ఆగస్టు 30కి చేంజ్ కావడంతో నాని తన సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయాల్సి వచ్చింది.

దీంతో తన సినిమా కోసం గ్యాంగ్ లీడర్‌ని వాయిదా వేసుకోవడంపై చిత్ర నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పారు ప్రభాస్‌. తాజాగా గ్యాంగ్ లీడర్‌ ప్రమోషన్ కార్యక్రమానికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తంగా నాని సినిమా కోసం ప్రభాస్ వస్తుండటంతో సినిమాకు మరింత హైప్ పెరిగే అవకాశం ఉందని నిర్మాతలు భావిస్తుండగా….ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఆర్ఎక్స్ 100ఫేమ్ హీరో కార్తీకేయ ఈసినిమాలో కీలక పాత్రలో నటించగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించింది.