‘కబీర్ సింగ్’ టీజర్‌పై ప్రభాస్‌ ప్రశంసలు..

70
Prabhas

టాలీవుడ్‌లో భారీ విజయం అందుకున్న ‘అర్జున్‌ రెడ్డి’బాలీవుడ్‌,కోలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని తమిళ్‌లో వర్మ పేరుతో తెరకెక్కిస్తుండగా.. హిందీలో ‘కబీర్‌ సింగ్‌’టైటిల్‌తో రూపొందిస్తున్నారు.. ఇక ఈ చిత్రం బాలీవుడ్‌లో షాహిద్‌ కపూర్‌, కియారా అడ్వాణీ జంటగా నటిస్తున్నారు. తెలుగులో తీసిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దీన్ని కూడా తెరకెక్కిస్తున్నారు.

ఇటీవల హిందీ రీమేక్‌ టీజర్‌ను విడుదల చేశారు. తెలుగు స్క్రిప్టులో ఎటువంటి మార్పులు చేయకుండా హిందీ చిత్రాన్ని తీసినట్లు టీజర్‌ను బట్టి తెలిసింది. షాహిద్‌ తన పాత్రలో ఒదిగిపోయారని విమర్శకులతోపాటు ప్రముఖులు ప్రశంసించారు.

Prabhas

కాగా ఈ టీజర్‌ ని రెబల్‌స్టార్‌ ప్రభాస్ చూశారట. చూడటమే కాదు షాహిద్ కి ఫోన్ చేసి ఒరిజినల్ అర్జున్ రెడ్డి ట్రైలర్ కంటే బావుందని ప్రశంసించారట. షాహిద్ లుక్ గురించి.. పెర్ఫామెన్సెస్ గురించి కాంప్లిమెంట్లు ఇచ్చాడట. ఆ సంగతిని ముంబై హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకిమ్ స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ హైదరాబాద్ లో సాహో షూటింగులో బిజీగా ఉన్నారు. సెట్స్ లోనే ఆయన కబీర్ సింగ్ ట్రైలర్ చూశారు. ట్రైలర్ చూడగానే పిచ్చిగా నచ్చేసింది.

ఇంప్రెస్ అయిపోయి వెంటనే షాహిద్ తో మాట్లాడతానని అన్నారట. ఆకిమ్ స్వయంగా షాహిద్ కి ఫోన్ లైన్ కలిపి ప్రభాస్ తో మాట్లాడించారు. ఫోన్ అందుకున్న ప్రభాస్ ఏకంగా ఏడు నిమిషాల సేపు షాహిద్ తో అదే పనిగా కబీర్ సింగ్ ట్రైలర్ గురించి ముచ్చటించారు. ఆ ముచ్చట్లలో ఒకటే కాంప్లిమెంట్ల వర్షం కురిపించారని ఆలిమ్ తెలిపాడు.