సాహో…సర్ ప్రైజ్‌

401
sahoo
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సాహో. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. తెలుగు,తమిళం,హిందీ భాషల్లో ఏకకాలంలో సినిమా తెరకెక్కుతుండగా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు ప్రభాస్.

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ‘సాహో’ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో చాలా సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన కళ్లద్దాలు కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్, విక్కీలు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించారు.

- Advertisement -