“సాహో” @424 కోట్లు

178
Sahoo

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 424 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అన్ని ఏరియా లనుంచి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది. ప్రభాస్ కలెక్షన్స్ పవర్ ఏంటో ఈ సినిమా మరోసారి ప్రూవ్ అయ్యింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై అన్ని భాషల్లోనూ ప్రభంజనం సృష్టించింది.

అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా సాహో రూపొందింది. హాలీవుడ్ సినిమాల స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు సుజీత్. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్, స్టంట్ కొరియోగ్రాఫర్లు పని చేశారు. ప్రభాస్ కెరీర్ లొనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. శ్ర‌ద్ధా క‌పూర్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసింది. భారీ ఖర్చుతో యూవీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.