“సాహో” వారం రోజుల కలెక్షన్లు..

297
sahoo

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఈనెల 30న విడుదలైప సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈమూవీకి సుజిత్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది. యూవీ క్రియేషన్స్ సంస్ధ భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కించారు.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ మొదటి వీకెండ్ లో భారీ కలెక్షన్స్ నమోదు చేసింది. దీనికి తోడు వరుసగా నాలుగు రోజులు వినాయక చవితి సెలవులు రావడంతో సాహోకు మరింత ప్లస్ గా మారింది. అంతేకాకుండా సాహోకు పోటీగా మరే సినిమా లేకపోవడంతో కలెక్షన్లకు ఎక్కడా ఇబ్బంది కలగలేదు.

హిందీలో ఈ చిత్రం దాదాపు రూ. 120 కోట్ల నెట్ వసూళ్ళతో హిట్ అనిపించుకుంది. కానీ హిందీ, తమిళ్, తెలుగు, కన్నడలో మాత్రం అంతంత మాత్రమే అని చెప్పుకోవాలి. అయితే నేటి నుంచి సాహో వసూళ్ల పూర్తిగా తగ్గిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘సాహో’ డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. మొదటి వారంలో సాహో రూ.70 కోట్ల షేర్ వసూలు చేసింది.

ప్రాంతాల వారీగా సాహో కలెక్షన్లు..
నైజామ్: 26.24 cr
ఉత్తరాంధ్ర: 8.94 cr
సీడెడ్: 10.79 cr
కృష్ణ: 4.69 cr
గుంటూరు: 7.44 cr
ఈస్ట్ గోదావరి: 6.92 cr
వెస్ట్ గోదావరి: 5.32 cr
నెల్లూరు: 3.90 cr

ఏపీ తెలంగాణా లో మొత్తంః రూ. 74.24 cr