‘సాహో’ జంటకు ఫిదా అయిన ఫ్యాన్స్‌..

59
Prabhas and Shraddha Kapoor

దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ డేట్ ఆగష్టు 15 అని తెలిసిందే. చివరి దశ షూటింగ్ లో ఉన్న ‘సాహో’ కు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. సుజీత్‌ దర్శకుడు వ్యవహరిస్తున్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ‘సాహో’ సినిమా సెట్‌ నుండి ఫొటో లీక్‌ అయ్యింది.

ఇందులో ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌ జంటగా కనిపించారు. పాట షూట్‌లో ఈ ఫొటోను క్లిక్‌ మనిపించినట్లు తెలుస్తోంది. ప్రభాస్‌, శ్రద్ధ ఒకర్నొకరు ప్రేమగా చూసుకుంటూ కనిపించారు. వీరి జోడీకి నెటిజన్లు ఫిదా అయ్యారు. చూడచక్కగా ఉన్నారంటూ తెగ కామెంట్లు చేశారు. సినిమా అప్‌డేట్స్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని డార్లింగ్‌ అభిమానులు పేర్కొన్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.