చిన్నారులపై లైంగిక దాడులు చేస్తే ఇక ఉరి శిక్షే..

68
Chaild Rape.jpeg

ఇటివలే కాలంలో చిన్నారులపై లైగింగ వేధింపులు పెరిగిపోతుండటంతో సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర క్యాబినెట్. చిన్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే ఇక వారికి మరణశిక్ష విధించాలంటూ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు పోక్సో (పొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టాన్ని పటిష్ఠం చేస్తూ పలు సవరణలను ఆమోదించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ కట్టడికి జరిమానాలు, జైలు శిక్షలు విధించేలా పోక్సో చట్టం-2012 లోని పలు సెక్షన్లకు సవరణలు చేశారు.

చిన్నారులపై తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడితే మరణశిక్ష సహా కఠిన శిక్షలు విధించేలా 4,5,6 సెక్షన్లలో సవరణలు చేశారు. దేశంలో రోజు రోజుకు చిన్నారులపై లైంగిక నేరాల ధోరణి పెరిగి పోతూ ఉండడం, అలాగే కొత్త రకాల లైంగిక నేరాలు చోటు చేసుకుంటుండంతో వాటిని అరికట్టేందుకే ఈ సవరణలు తోడ్పడుతాయని కేంద్ర క్యాబినెట్ తెలిపింది. అలాగే దేశంలోని లక్షలాది మంది సంఘటిత, అసంఘటిత రంగ కార్మి రక్షణ కోడ్ కు మంత్రివర్గం అమోదంతెలిపింది. 13 కేంద్ర కార్మిక చట్టాలను ఒకే కోడ్ పరిధిలోకి తీసుకురానున్నారు.